Thursday, April 25, 2024

కోటంచకు పోటెత్తిన భక్త జనం.. క‌న్నుల‌పండువ‌గా ల‌క్ష్మీ న‌ర‌సింహుని క‌ల్యాణోత్స‌వం..

రేగొండ రూరల్, (ప్రభ న్యూస్): జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారికి వేద మంత్రాల సాక్షిగా, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగింది. కళ్యాణ మహోత్సవం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో కొడవటంచ ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

ముందుగా అశ్వవాహన సేవలో స్వామి వారు కోలాటాల మధ్య ఆలయ ప్రాంగణంలో ఊరేగారు. భక్త జనం ఎదురుకోళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు చుట్లు తిరిగిన అనంతరం కళ్యాణమండపానికి చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మాసం నాడు జరిగే కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారికి నూతన దుస్తులను బహూకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement