Friday, October 4, 2024

Devara – అభిమానుల అత్యుత్సాహం – త‌గ‌ల‌బ‌డిన ఎన్టీఆర్ భారీ క‌టౌట్ – వీడియోతో

ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేట‌ర్ వ‌ద్ద ఘ‌ట‌న‌
అభిమానుల కాల్చిన ట‌పాసులుతో ప్ర‌మాదం

హైదరాబాద్ – ఎట్టకేలకు అనేక రిలీజ్ వాయిదాల తర్వాత దేవర వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దింతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈలలు, గోళాలు, టపాయకాయలు, డిజె సౌండ్స్ తో థియేట‌రలు మోత మోగిపోయాయి. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35 ఎం ఎం లో దేవర కు కేటాయించారు. నిన్న రాత్రి నుండి భారీ కటౌట్ లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బాణాసంచాలతో అభిమానులు ఎన్టీయార్ పాటలతో హోరెత్తించారు. కాగా తెల్లవారు జామున నుండి షోస్ స్టార్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ఉదయం ఆట ముగిసాక సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రమం లో నిప్పు రవ్వ పక్కనే ఉన్న ఎన్టీయార్ కటౌట్ పై పడింది. చెక్క కటౌట్ కావడంతో నిప్పు రవ్వ పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఎన్టీయార్ కటౌట్ పూర్తిగా తగలబడింది. దీంతో బయాందోళకు గురైన ప్రేక్షలులు పరుగులు తీసారు. ఫ్యాన్స్ మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement