Friday, March 29, 2024

తాండూరులో ఉద్రిక్తత: స‌ర్పంచ్‌పై ఉప‌స‌ర్పంచ్ దాడి

వికారాబాద్ జిల్లా తాండూరు మండ‌లంలోని మిట్ట‌బాస్ప‌ల్లి గ్రామంలో గ్రామ స‌ర్పంచ్‌పై అదే గ్రామ ఉప‌స‌ర్పంచ్ దాడికి పాల్ప‌డ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం ఉద‌యం తాండూరు మండ‌లంలో చోటు చేసుకుంది. స‌ర్పంచ్‌పై దాడిచేసిన ఉప‌స‌ర్పంచ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామ‌స్తులు పెద్ద ఎత్తున పోలీస్టేష‌న్‌కు త‌ర‌లివ‌చ‌డంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

వివ‌రాల్లోకి వెళితే.. తాండూరు మండ‌లం మిట్ట‌బాస్ప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ న‌రేంద‌ర్‌రెడ్డితో పాటు వార్డు స‌భ్యులు, గ్రామ పెద్ద‌లు అదే గ్రామ ఉప‌స‌ర్పంచ్ గోవింద్‌పై గ‌త కొన్ని రోజుల క్రితం అవిశ్వాసం తీర్మానం పెట్టారు. తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌కు ఉప‌స‌ర్పంచ్‌ను తొల‌గించాల‌ని ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం గ్రామ స‌ర్పంచ్ న‌రేంద‌ర్‌రెడ్డి బైకుపై వెళ్తుండగా.. హ‌నుమాన్ దేవాల‌యం వ‌ద్ద ఉప స‌ర్పంచ్ గోవింద్ ఆయ‌ను నిలిపాడు. ఈ క్రమంలో స‌ర్పంచ్‌పై దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో స‌ర్పంచ్ న‌రేంద‌ర్‌రెడ్డి, గ్రామ పెద్ద‌లు పెద్ద ఎత్తున క‌ర‌ణ్ కోట్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుని స‌ర్పంచ్‌పై దాడికి పాల్ప‌డిన ఉపస‌ర్పంచ్ గోవింద్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. విష‌యం తెలుసుకున్న తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి పోలీస్టేష‌న్‌కు చేరుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రోవైపు స‌ర్పంచ్ న‌రేంద‌ర్‌రెడ్డిపై దాడి విష‌యం తెలుసుకున్న ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్ట‌ర్ ఎస్.ర‌వీంద‌ర్‌గౌడ్, మార్కెట్ క‌మిటి మాజీ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, నాయ‌కులు వీరేంద‌ర్ రెడ్డిలు పోలీస్టేష‌న్‌కు చేరుకున్నారు. దాడికి పాల్ప‌డిన ఉప‌స‌ర్పంచ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: దుర్గమ్మ ఆలయానికి సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement