నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బండారి లేఔట్ రోడ్ నెంబర్-10 వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆహా బాక్స్ క్రికెట్, కుంగ్-ఫు అకాడమీని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని 27వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి నర్సింహా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ను కార్పొరేటర్, సీనియర్ నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బండారి లేఔట్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు బాల వెంగయ్య చౌదరి, 27వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ రవీంద్ర బాబు, యజమానులు మైనంపతి హనుమ సతీష్ అండ్ సౌమ్య ప్రియ, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital