Monday, October 14, 2024

TG: మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల్చివేత‌లు షురూ…

శంక‌ర్ న‌గ‌ర్ లో స్వ‌చ్చందంగా ఖాళీ చేసిన కుటుంబాలు
వారికి డ‌బుల్ బెడ్ రూంలు కేటాయింపు
ఆ గృహాల‌ను కూల్చివేస్తున్న‌ అధికారులు

హైద‌రాబాద్ – మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మూసీ రివర్ బెడ్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. మలక్‌పేట పరిధిలోని శంకర్‌ నగర్‌లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. పునర్నివాసంలో భాగంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను రెవెన్యూ అధికారులు నిర్వాసితులకు అందజేశారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లలోకి షిఫ్ట్ అయ్యిన వారి నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ కూల్చివేతలు కొనసాగనున్నాయి. చాదర్‌ఘాట్ సమీపంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతోంది. ఇక ఇళ్లు ఖాళీ చేస్తున్న‌వారి సామానులు త‌ర‌లించేందుకు అధికారులు వాహ‌నాలను ఏర్పాటు చేశారు.. మూసీ రివర్‌ బెడ్‌లో కూల్చివేతలతో తమకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా ప్రకటించింది. ఈ కూల్చివేత‌లు మూసీ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డు చేపట్టింద‌ని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement