Tuesday, September 19, 2023

ఘనంగా దశాబ్ది ఉత్సవాలు.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్ హాల్ లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులతో దశాబ్ది ఉత్సవాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ఉత్సవాల విజయవంతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్.. అధికారులు, ప్రజానిధులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement