బాసర, ఆక్టోబర్ 2 (ప్రభ న్యూస్) : బాసర గోదావరి నదిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు బుధవారం ఎస్ఐ గణేష్ తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా లింగసముద్రం గ్రామానికి చెందిన వంగదారి అద్రత్ (37)గా గుర్తించారు. నెల్లూరు నుండి బాసరకు మేస్త్రి పనికి వచ్చిన అద్రత్ మంగళవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయాడు.
మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
- Advertisement -