Friday, April 26, 2024

వరద సాయం ఎందుకు ఇవ్వడం లేదు: కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ మంత్రి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రభుత్వం వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధ ప్రాతిపాదికన విడుదల చేయాలని కోరుతూ కేటీఆర్ ని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా వరద సాయం ఎందుకు పంపిణీ చేయండం లేదని లేఖలో నిలదీశారు దాసోజు శ్రవణ్. దాదాపు 5లక్షమంది అక్టోబర్ 2020 వరద బాదితులు నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు దాసోజుశ్రవణ్. గత కొద్ది రోజులు కురుస్తున్న వర్షాలు కారణంగా దాదాపు 200 కోట్ల రూపాయిల నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనా వేయగా… ఈ నష్ట పరిహారాన్ని ఎప్పుడు చెల్లిస్తారని నిలదీసారు దాసోజు శ్రవణ్. నాళాల వైడింగ్, స్ట్రాటజిక్ నాళా డెవలప్మెంట్ ని ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేసి వరదల నుంచి హైదరాబాద్ ని కాపాడుతారని కేటీఆర్ ను ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి : 250 ఏళ్ల క్రితం త‌యారు చేసిన మద్యం బాటిల్ ఖరీదు కోటి

Advertisement

తాజా వార్తలు

Advertisement