Tuesday, April 23, 2024

ద‌స‌రా విజ‌యోత్స‌వ స‌భ‌.. పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మంత్రి

ఈ మ‌ధ్య‌కాలంలో తెలంగాణ సంస్కృతిపై..తెలంగాణ యాస‌లో ప‌లు చిత్రాలు తెర‌కెక్కి విజ‌యాన్ని అందుకుంటున్నాయి. వాటిల్లో బ‌ల‌గం..ద‌స‌రా కూడా ఉన్నాయి. కాగా దసరా సినిమా విజయోత్సవ సభ పోస్టర్ ను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆవిష్కరించి మాట్లాడారు.తెలంగాణ కుటుంబ నేపథ్యం, బంధాలు అనుబంధాల గురించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కు చెందిన వేణు నిర్మించిన బలగం సినిమా విజయవంతమై కరీంనగర్‌లో విజయోత్సవ సభ నిర్వహించారని గుర్తు చేశారు. సింగరేణి బొగ్గు గని జీవితాల నేపథ్యంతో తీసిన దసరా సినిమా విజయవంతం అవడం ఈ సినిమా విజయోత్సవ సభ కరీంనగర్ లో జరపడం అభినందనీయమన్నారు. అభివృద్ధి చెందుతున్న కరీంనగర్‌లో సినిమా విజయోత్సవ సభలను జరుపుకోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కరీంనగర్ టూరిజం స్పాట్ గా మారనుందన్నారు. తెలంగాణ యాసతో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్‌ నటించిన దసరా చిత్రం విజయోత్సవ సభ కరీంనగర్‌లోని స్థానిక ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement