Saturday, November 9, 2024

Basara: సిద్ధ‌దాత్రి అవ‌తారంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం…

బాసరలో తొమ్మిదో రోజుకు చేరిన‌ శార‌దీయ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, బాస‌ర : నిర్మ‌ల్ జిల్లా బాస‌ర పుణ్య‌క్షేత్రంలోని శ్రీ‌జ్ఞాన స‌ర‌స్వ‌తీ దేవి అమ్మ‌వారి స‌న్నిధిలో శార‌దీయ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు శుక్ర‌వారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. శ్రీ‌జ్ఞాన స‌ర‌స్వ‌తీదేవీ సిద్ధదాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సంద‌ర్భంగా అమ్మవారికి అర్చకులు విశేష సహస్రనామార్చన చేశారు. పాయసం నైవేద్యంగా సమర్పించారు.

తెల్ల‌వారు జాము నుంచి ద‌ర్శ‌నాలు…
తెల్ల‌వారు జాము ఐదు గంట‌ల నుంచి శ్రీ‌జ్ఞాన స‌రస్వ‌తీ దేవీ, శ్రీ‌మ‌హాల‌క్ష్మి, శ్రీ‌మ‌హ‌కాళి అమ్మ‌వార్ల‌ను భ‌క్తులు ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజలు చేశారు. తొలుత గోదావ‌రి న‌దిలో పుణ్య‌స్నానాలు ఆచ‌రించి న‌ది తీరాన గ‌ల శివాల‌యంలో అభిషేక అర్చ‌న‌లు చేశారు. అనంత‌రం స‌ర‌స్వ‌తీ ఆల‌యానికి చేరుకుని పిల్ల‌ల‌కు అక్ష‌రాభ్యాసం చేసి అనంత‌రం ముగ్గురు అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలోని నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. కాల చేప మండపంలో సాంస్కృతిక‌ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement