Monday, December 9, 2024

Breaking: భ‌ద్రాచ‌లం వ‌ద్ద డేంజ‌ర్ బెల్స్‌.. 50 అడుగుల‌కు చేరిన గోదావ‌రి నీటి మ‌ట్టం

భద్రాచలం, (ప్రభ న్యూస్): అత్యంత భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో భద్రాచలం వద్ద మ‌రోసారి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. గోదావరి న‌దిలో నీటి మట్టం 50 అడుగులకు చేరింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో గోదావ‌రి నీటి మ‌ట్టం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

గత జులై నుంచి గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన గోదావరి న‌ది మరోసారి 53 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్ర‌వాహ తీరును ప‌రిశీలించిన అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement