Thursday, April 25, 2024

దళితబంధు పథకంపై హై కోర్టులో పిటిషన్..

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువస్తున్న దళితబంధు పథకం పై మొదటి నుంచి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అంతేకాదు దళితబంధు పథకం కోసం హుజూరాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ హైకోర్టులో శుక్రవారం నాడు పిల్ దాఖలైంది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి.

దళితబంధు పథకంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం నాడు  పిల్ దాఖలైంది.  ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే హుజూరాబాద్ లో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో హైకోర్టులో పిల్ దాఖలైంది.కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఈసీ, తెలంగాణ ప్రభుత్వాన్ని  ప్రతివాదులుగా చేశారు పిటిషనర్లు.రైతు బంధు పథకం తరహలోనే దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని  హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టడం సరికాదని పిల్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: విజయసాయి బెయిల్ రద్దుకు పిటిషన్!

Advertisement

తాజా వార్తలు

Advertisement