Monday, April 15, 2024

గోల్డ్ స్మగ్లర్ అతి తెలివి… అడ్డంగా బుక్కయ్యాడు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. కువైట్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. 34 లక్షల విలువ చేసే 24 క్యారెట్ల బంగారాన్ని గొలుసుల రూపంలో తెచ్చిన కేటుగాడు… తాను వేసుకున్న ప్యాంట్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జేబులో దాచి తరలించే యత్నం చేశాడు. అయితే, ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్ అధికారుల‌ తనిఖీలలో విదేశీ బంగారం బయటపడింది. బంగారం సీజ్ చేసిన అధికారులు ప్రయాణీకుడిని అరెస్ట్ చేసి…కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కాగా, అక్రమార్కులు పెద్ద ఎత్తున విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి ఈ బంగారం అక్రమ రవాణా ఎక్కువ జరుగుతోంది. కూలీల ద్వారా గల్ఫ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. వివిధ పరికరాలు, బెల్టులు, లో దుస్తులు ఇలా వివిధ వాటిల్లో పుత్తడిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయాల్లో డీఆర్​ఐ, కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ తదితర శాఖల అధికారులు నిఘా పెంచారు. అనుమానం ఉన్న ప్రతి అంతర్జాతీయ ప్రయాణికుడిని తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement