Wednesday, April 24, 2024

ఈ నెల 16 నుంచి రైతు రుణమాఫీ..

తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న రైతులకు గుడ్‌న్యూస్‌… ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్..ఈ నెల 15 నుంచి నెలాఖరులోగా రుణాలు మాఫీ కానున్నాయి. 50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 25 వేల వరకూ ప్రభుత్వ మాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు… బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయొద్దని… పూర్తిగా రుణా మాఫీ ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం… రుణ మాఫీ జరిగిన రైతుల ఖాతాల్లో జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో జరిగిన బ్యాంకర్ల సమావేశానికి 42 బ్యాంకుల అధికారులు హాజరుకాగా… ఈ మేరకు ఆదేశించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.

ఇది కూడా చదవండి: జగిత్యాలలో జాలరుకు చిక్కిన అరుదైన దెయ్యం చేప..

Advertisement

తాజా వార్తలు

Advertisement