Thursday, April 25, 2024

Crime: పంట పొలాల్లో గంజాయి.. ప‌ట్టుకున్న పోలీసులు.. ఎక్క‌డో తెలుసా..

Jagityala: గంజాయి సాగుపై జగిత్యాల పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై దృష్టిసారించారు.

జగిత్యాల బీట్ బజార్ కు చెందిన అరుముళ్ల సాయికుమార్, ఆసిఫాబాద్ లింగాపూర్ గ్రామానికి చెందిన చందు గంజాయి సాగు చేస్తున్నారన్న‌ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. గంజాయి మొక్కలతో పాటు మూడు బైక్‌ల‌ను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement