Monday, May 29, 2023

చ‌ట్టాల అవ‌గాహ‌న‌తో నేరాలు అదుపు చేయొచ్చు : జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్

చట్టాల అవగాహనతో నేరాలు అదుపు చేయవచ్చునని నాగర్ కర్నూల్ జిల్లా జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పెద్దపల్లి, పెద్దూరు, గౌరెడ్డిపల్లి గ్రామాల్లో లీగల్ అవేర్ నెస్ ప్రోగ్రాం నాగర్ కర్నూల్ జిల్లా సివిల్ జడ్జి స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ… గ్రామాల్లో ప్రజలకు న్యాయ సంబంధిత అవగాహన అవసరమని, మహిళలు చట్టాల రక్షణ విషయంలో చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయంపై అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రతిఒక్కరూ చట్టాల నేర నివృత్తి పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తిని జ‌డ్పీ చైర్ పర్సన్ పద్మావతి, గ్రామ సర్పంచ్ అనసూయలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామాల సర్పంచులు అనసూయ సుధాకర్ శైలజ భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ లింగమయ్య, ఉప సర్పంచ్ చంద్రయ్య, మాజీ జ‌డ్పీటీసీ నరేందర్ రెడ్డి, జిల్లా అదనపు న్యాయమూర్తి రవికుమార్, న్యాయవాదులు శ్యాంసుందర్, శ్రీరామ్, రంజిత్, గ్రామాల యువకులు, పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement