Thursday, April 25, 2024

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై టీఆర్ఎస్,బీజేపీ దొంగాట

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సహా రైల్వే ప్రాజెక్టుల సాధనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కాజీపేట మండల సిపిఐ మహాసభ బొట్టు బిక్షపతి అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో వున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై టీఆర్ఎస్, బిజెపి పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. అలాగే కాజీపేట రైల్వే వ్యాగన్ పరిశ్రమకు భూమి కేటాయించామని రాష్ట్రం, నిధులు కేటాయించకుండా కేంద్రం డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

ఏండ్ల తరబడి కాజీపేట రైల్వే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సాదించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలం అయిందన్నారు. తెలంగాణకు ముఖ్యంగా వరంగల్ ప్రజలకు తీరని ద్రోహం చేసిన ఈ పార్టీలను జిల్లా ప్రజలు నిలదీయాలన్నారు. జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు నెనెలకొల్పాలన డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, పెట్రోల్, డీజిల్, గ్యాస్,నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజల జీవితాలపై పెనుభారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement