Thursday, December 5, 2024

TG | అనుమానాస్ప‌ద‌స్థితిలో దంప‌తుల మృతి

  • సిరిసిల్ల పొలాల్లో సంఘ‌ట‌న‌
  • మృత‌దేహాల వ‌ద్ద ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో క‌ట్టె… పురుగుల మందు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రం శాంతిన‌గ‌ర్‌కు చెందిన ముదాం వెంక‌టేష్ (40), వ‌సంత (36) దంప‌తులు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. వీరి మృత‌దేహాల వ‌ద్ద ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో ఉన్న‌క‌ట్టె, పురుగుల మందు ద‌బ్బా ఉండ‌డంతో మ‌రణాల‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న‌పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

పొలంలో మృత‌దేహాలు…
శాంతి నగర్ లో ముదాం వెంకటేష్ నివాసం ఉంటున్నారు. ఆయ‌న‌కు భార్య‌ వసంత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురువారం ఉద‌యం పొలంలో వెంక‌టేష్‌, వసంత మృత‌దేహాలు స్థానికులు చూసి పోలీసుల‌కు స‌మాచ‌రం ఇచ్చారు. ఘటన స్థలంలో పురుగుల మందు డబ్బా కట్టెకు రక్తపు మరకలు గుర్తించారు. అయితే కుటుంబ క‌ల‌హాలు ఏమైనా ఉన్న‌యా? అనేది గ్రామ‌స్థులు చ‌ర్చించుకుంటున్నారు. భార్య‌ను హ‌త్య చేసి భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా? లేదా ఎవ‌రైనా వారిని హ‌త్య చేసి ఇలా చిత్రీక‌రించారా? అనే పోలీసుల ద‌ర్యాప్తులో తేల‌నుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement