Friday, March 24, 2023

Telangana | రాజ‌కీయంగా ఎదుర్కోలేకే కుతంత్రాలు.. మోకాళ్లపై కుర్చుని బోరుమ‌న్న రాజయ్య

రాజ‌కీయంగా త‌న‌ను ఎదుర్కోలేక ప్ర‌తిప‌క్ష నేత‌లు కుతంత్రాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఎమ్మెల్యే రాజ‌య్య మండిప‌డ్డారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇవ్వాల (బుధ‌వారం) ఆయ‌న‌ ఫాదర్ కొలొంబో 97వ జన్మదినం సందర్భంగా మాట్లాడారు. కరుణపురం వ‌చ్చిన రాజ‌య్య‌.. తనను రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మోకాళ్లపై కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించారు. శిఖండి రాజకీయాల‌తో త‌న అక్కచెల్లెళ్ల‌ తో కూడా ఆప్యాయంగా మాట్లాడలేకపోతున్నా అన్నారు.

- Advertisement -
   

తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని, ఏ సర్వే చేసినా తాను ముందు వరుసలో ఉన్నానన్నారు ఎమ్మెల్యే రాజ‌య్య‌, ఫాదర్ కొలొంబో ఆశీస్సులతో 5 వసారి ఎమ్మెల్యే గా తానే గెలుస్తానని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రతిపక్షాలు గాని త‌న‌ను ఫెస్ టు ఫెస్ ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నేను ఏ రోజు రాజకీయాలు చేయలేదు. 2018 ఎలక్షన్ లో కూడా కొంతమంది నాయకులు త‌న‌ను ఎదుర్కోలేక ఇలాగే వ్యవహరిస్తూ ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేసినా కూడా ప్రజలు అప్ప‌టి ఎన్నిక‌ల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నీరు. ఎవ‌రు ఏం చేసినా ప్ర‌జ‌లకు తాను ఏంటో తెలుస‌న్నారు ఎమ్మెల్యే రాజ‌య్య‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement