Tuesday, October 26, 2021

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతు: రేవంత్

ఎస్సీ వర్గీకరణ ఎంతో కీలకమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వర్గీకరణకు అనుకూలంగా గతంలోనే తాను అసెంబ్లీ‌లో వాయిదా తీర్మానాన్ని ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను రేవంత్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ 25 ఏళ్లుగా కృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎందుకు వర్గీకరణపై కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి గతంలో మాదిగలకు వర్గీకరణ‌పై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు పెడితే  తాము మద్దతిస్తామని రేవంత్ ప్రకటించారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. దళిత బంధు లాంటి పథకాలు కాదు వర్గీకరణ కావాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: సినిమా టికెట్ల రేట్లు మీ ఇష్టం: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News