Sunday, October 17, 2021

కేసీఆర్ అసెంబ్లీలో హెడ్ మాస్టర్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా… అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హెడ్ మాస్టర్ అని.. ఎమ్మెల్యేలు అంతా స్టూడెంట్స్ అని అన్నారు. ఇది తమ పరిస్థితి అని ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో పాఠాలు చెబుతున్నారని చెప్పారు. కానీ స్టూడెంట్స్ పాస్ అయ్యేలా చెప్పడం లేదన్నారు. ఎమ్మెల్యేలకు డౌట్ వస్తే హెడ్ మాస్టర్‌గా ఉన్న సీఎంను ప్రశ్న అడిగే అవకాశం లేదని జగ్గారెడ్డి చెప్పారు.

ఇది కూడా చదవండి: Huzurabad by election: గెల్లు శ్రీనివాస్ నామినేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News