Friday, March 29, 2024

TS: ఘనంగా రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు

టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని  కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వైస్ చైర్మన్ దూడ పాక శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి భువన సుందర్, ఎంపీపీ కావటి రజిత రవీందర్, వైస్ ఎంపీపీ విడిది నేని అశోక్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement