Thursday, April 25, 2024

దళిత బంధు ఓకే.. బీసీ బంధు సంగతేంటి?

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధుపై విపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంటే.. ఆపార్టీకి చెందిన కొందరు మద్దతు తెలుపుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు పథకమంటూ కాంగ్రెస్ ఓవైపు ఆరోపిస్తుంటే… పార్టీలో మరో వర్గం మాత్రం మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆసక్తికర వ్యకలు చేశారు.

దళిత బంధును స్వాగతిస్తున్నామని వీహెచ్ తెలిపారు. అయితే, తెలంగాణలో బీసీలు కూడా చాలా వెనుకబడి ఉన్నారని వాళ్లకు కూడా బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజురాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దళిత బంధును అమలు చేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తాను మూడేళ్ల నుంచి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో ఈ నెల 6న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అన్ని రాజకీయ పక్షాలు, కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వీహెచ్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement