Thursday, August 5, 2021

ఈటలకు కౌశిక్ రెడ్డి కౌంటర్… వందల ఎకరాలు ఎలా వచ్చాయంటూ..

గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థితో కలిసి టీఆర్ఎస్ కుట్ర చేసిందన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈటల అమరవీరుల కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసైన్డ్ భూములు కొనకూడదని ఈటలకు తెలియదా? అని నిలదీశారు. రెండు ఎకరాలు మాత్రమే ఉన్న ఈటలకు వందల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నానక్ రామ్ గూడ, రావల్‌కోల్‌లో ఈటలకు భూములు ఎలా వచ్చిందని అడిగారు. అసైన్డ్ భూములు కొన్నానని స్వయంగా ఒప్పుకున్నా ఈటల జైల్‌కు వెళ్లడం ఖాయమని కౌశిక్ రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News