Thursday, October 21, 2021

ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత వీహెచ్ లేఖ

ప్రధాని నరేంద్ మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు లేఖ రాశారు. ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని లేఖలో కోరారు. బీసీ ప్రధాన మంత్రిగా చెప్పుకునే నరేంద్రమోదీకి చిత్తశుద్ధి ఉంటే ఓబీసీల క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలన్నారు. పేరుకు 27% కేటాయించినా.. ఇప్పటి వరకు బీసీలకు 9 నుంచి 10 శాతం కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించకుంటే వందేళ్లు అయినా బీసీలకు న్యాయం జరగదన్నారు. పి.వి.నరసింహారావు పీఎంగా ఉన్నప్పుడు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్‌ను ఇప్పటికీ పెంచలేదని చెప్పారు. మోదీ తన మంత్రి వర్గంలో 27 మంది బీసీ మంత్రులను క్రిమిలేయర్ చూసి పదవులు కట్టబెట్టరా ? అని వీహెచ్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News