Wednesday, May 19, 2021

మంత్రి ఈటల చెపితే వినేవాళ్లే లేరు: భట్టి

తెలంగాణలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ అన్నారు. కరోనా ప్రారంభమై ఏడాది దాటిపోతోందని, అయినప్పటికీ ఇంతవరకు ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రానికి సచివాలయం లేకపోవడంతో పాలనా వ్యవస్థ కుప్పకూలిందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారని, పేద ప్రజల వైద్యానికి మాత్రం బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ చెపుతున్న మాటలను వినేవాళ్లు కూడా ప్రభుత్వంలో లేరని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా మరణాలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News