Sunday, December 5, 2021

ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యేలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని ఇవాళ‌ ఉదయం ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే లు యాదయ్య, రోహిత్ రెడ్డి తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మహేందర్రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పలు మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పిటీసీలు, సీనియర్ నాయకులు తదితరులు మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News