Thursday, December 12, 2024

TG | విచారణకు వచ్చేయండి… మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ తాఖీదు

  • మెడికల్ కళాశాలలో అక్రమాలు
  • సోదాలలో బయటపడ్డ గుట్టు

హైదరాబాద్ – మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. విచార‌ణ‌కు రావాల్సిందిగా ఇవాళ ఈడీ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై నోటీసులు ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. ఇదిలా ఉంటే గత ఏడాది జూన్ లో ఈడీ అధికారులు మాజీ మంత్రి మల్లారెడ్డి మెడికల్ కళాశాలలపై సోదాలు నిర్విహించిన విషయం తెలిసిందే.

సుమారు 12 మెడికల్‌ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.

పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి అమ్మకున్నట్లు ఈడీ గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement