Friday, March 29, 2024

హాస్టల్ బాలికలతో క‌లిసి కలెక్టర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌.. ఫుల్ ఖుషీ అయిన స్టూడెంట్స్‌

కామారెడ్డి, (ప్రభన్యూస్) : హాస్ట‌ల్ స్టూడెంట్స్‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో ఇవ్వాల (బుధ‌వారం) జ‌రిగింది. కామారెడ్డి సమీకృత బాలికల వసతి గృహంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వసతి గృహంలో కలెక్టర్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థునులు కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ నోట్ పుస్తకాలను అందజేశారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టర్ ను కలిసి నోట్ పుస్తకాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఈ సెల‌బ్రేష‌న్స్ విష‌యంలో హాస్ట‌ల్ స్టూడెంట్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement