Friday, April 26, 2024

అన్ని రంగాల్లో అభివృద్ది చేయ‌డ‌మే సీఎం ల‌క్ష్యం : మంత్రి మ‌ల్లారెడ్డి

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను (60) రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్దిదారులకు అందజేయడం జరిగింది.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేస్తున్న‌ అభివృద్ధి, ప్ర‌వేశ‌పెడుతున్న‌ సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా ఉన్నాయ‌న్నారు. పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయ‌న్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామలా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారాన్ని తగ్గిస్తున్నారన్నారు.

ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని, ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా రూ.1,00,116లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమ‌న్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని, కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెళ్లి చేసే వరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలొ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్ ఛార్జి రాజశేఖర్ రెడ్డి, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement