Friday, December 6, 2024

TG | ₹110 కోట్లతో ఎలివేటెడ్​ కారిడార్​.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్​

ఆంధ్రప్రభ, హైదరాబాద్​: మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. జిల్లాలోని కురుమూర్తి స్వామిని దర్శించుకోనున్నారు. ₹110 కోట్లతో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మెట్ల మార్గంలో కాంచన గుహలో వెలిసిన కురుమూర్తి స్వామిని సీఎం దర్శించుకోనున్నారు. సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సీఎం రాకతో మహబూబ్ నగర్​లో పోలీసులు బారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

జిల్లాలోని పలు రూట్లలో ట్రాఫిక్​ను దారి మళ్లించారు. వాహనదారులు వేరే మార్గాల నుంచి వెళ్లాలని సూచించారు. పోలీసులకు వాహనదారులు సహకరించాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. సీఎం వచ్చి వెళ్లేంత వరకు ట్రాఫిక్ నియంత్రణలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

సీఎం రేవంత్​రెడ్డి పర్యటన లైవ్​ కోసం ఈ లింక్​ క్లిక్​ చేయండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement