Thursday, December 5, 2024

TG | రేపే సీఎం రేవంత్ పాద‌యాత్ర… రూట్ మ్యాప్ ఇదే !

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రేపు (నవంబర్ 08) పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రేపు చేపట్టనున్న పాదయాత్ర సహా.. పలు కార్యక్రమాల షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్‌తో పాటు పాదయాత్ర రూట్ మ్యాప్ గురించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.

షెడ్యూల్ ప్రకారం… రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హెలికాప్టర్ లో ఉదయం 8:45 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి దర్శనానంతరం ఉదయం 10 గంటలకు వీటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

అనంతరం.. మధ్యాహ్నం ఒంటి గంటకు వలిగొండ మండలం సంగెం గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. “మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర” పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు వలిగొండ మండలం సంగెం గ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకుని… మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ యాత్రలో భాగంగా.. మూసీ నది వెంబడి పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ.. వారి బాధలు తెలుసుకుంటూ.. మూసీకి పునరుజ్జీవంపై భరోసా కల్పించనున్నారు.

ఈ క్రమంలో భీమ లింగం, ధర్మారెడ్డి కాల్వలను కూడా రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం మూసీ పరివాహక ప్రాంత రైతులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement