Monday, October 7, 2024

TG: సీఎం రేవంత్ సార్… మా ఇల్లు మాకు కావాలి..!

హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్‌పై భాదిత ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ రోడెక్కారు. ఈ క్రమంలోనే తాజాగా హైదర్షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇండ్లు కూల్చొద్దు అంటూ ప్లకార్డులతో భాదిత కుటుంబాలు, చిన్నారులు నిరసన తెలిపారు. చిన్నారులు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మా ఇల్లు మాకు కావాలి.. ప్లీజ్ హెల్ప్ చేయండి.. అని ఓ చిన్నారి మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మేము రోడ్డున పడతాం.. హైడ్రా ప్లీజ్ మా ఇండ్లు కూల్చొద్దు.. మా పేరెంట్స్ గురించి బాధ అయితుంది.. అంటూ మరో చిన్నారి మీడియాతో మాట్లాడింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో కొంత మంది నెటిజన్లు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిన్న పిల్లలను కూడా రోడ్డెక్కించేలా చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement