Saturday, March 23, 2024

రేపు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దుగ్గొండి మండలం అడవి రంగాపూర్,సంగెం మండలం, వంజరపల్లిలో దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం రోడ్డుమార్గంలో గిర్నిబావి, కొమ్మాల, పల్లారుగూడ, వంజరపల్లిలో పంటలను పరిశీలించనున్నారు. అనంతరం పల్లారుగూడ, మచ్చాపూర్, గంగదేవిపల్లి, టెక్స్ టైల్ పార్కుకి చేరుకొని అక్కడి నుండి హెలిక్యాప్టర్ లో తిరిగి హైదరాబాద్ కు సీఎం వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement