ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో సీఎం కెసిఆర్ రేపు పర్యటించనున్నారు. . గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఖమ్మం జిల్లా బోనకల్లులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం వరంగల్ జిల్లాలో పరిశీలన తర్వాత కరీంనగర్ జిల్లా చేరుకుంటారు. రామడుగు మండలంలో దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలిస్తారు. ఆయా ప్రాంతాల్లోని అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పంట నష్టం వివరాలు తెలుసుకుంటారు. సీఎం పర్యటన దృష్ట్యా ప్రత్యేకంగా హెలిప్యాడ్ తో పాటు రైతు వేదికలో సమావేశం నిర్వహించే ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈమేరకు ఆయా జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -
.