Thursday, April 25, 2024

ఈ నెల 26న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర క‌లెక్ట‌ర్ల‌తో నిర్వహించే స‌మావేశం  తేదీలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 28వ తేదీకి బ‌దులుగా రెండు రోజులు ముందే అంటే జూన్ 26న క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ స‌మావేశానికి మంత్రులు క‌లెక్ట‌ర్లు, స్థానిక సంస్థ‌ల అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌తో పాటు డీపీవోలు, డీఆర్డీవోలు హాజ‌రు కానున్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, హ‌రిత‌హారంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, జూలై 1 నుంచి 10వ తేదీ వరకు పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లతో సీఎం సమావేశం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement