Sunday, June 4, 2023

ఎమ్మెల్యే చిరుమర్తిని పరామర్శించిన సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్యను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఇటీవలే మరణించిన ఎమ్మెల్యే లింగ‌య్య తండ్రి చిరుమ‌ర్తి న‌ర‌సింహ సంతాప కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ న‌ర‌సింహ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, కొప్పుల ఈశ్వ‌ర్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నివాళుల‌ర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement