Wednesday, February 8, 2023

బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్.. ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని బొగ్గుల కుంట, తిలక్ రోడ్ లోని తెలంగాణ సరస్వత పరిషత్ దేవులపల్లి రామానుజారావు సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ దారిదీపాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విశిష్ట అతిధిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజ‌రై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా.. వివిధ రంగాల్లో గెలుపొందిన వారికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పురస్కారాలు అందించి సత్కరించారు. అనంత‌రం ఉప్పల శ్రీనివాస్ గుప్తాను ఘనంగా సన్మానించారు.

- Advertisement -
   


ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. ఆడ బిడ్డలను గౌరవించే సంస్కృతి మన తెలంగాణ దేన‌న్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్, ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ పథకం ప్రభుత్వం అమలు చేస్తుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కవులకు, కళాకారులకు, సాహిత్య రంగానికి, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. సినిమాల్లో తెలంగాణ కవులకు, కళాకారులకు ప్రాధాన్యత పెరిగింది, మన భాష, యాశ కు గుర్తింపు లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సాహిత్య ప్రియులని, ఆయన సొంతంగా పాటలు రాస్తారన్నారు. తెలంగాణలో కవులను, కళాకారులను గుర్తించి, గౌరవ ప్రదమైన పదవులిచ్చి గౌరవించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో.. సిన గర్ రెడ్డి వెంపట్ తెలంగాణ దారిదీపాలు డా.అమ్మంగి వేణుగోపాల్ ప్రముఖకవి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ తొలి పురస్కార గ్రహీత విశిష్ట అతిథులు గోరటి వెంకన్న ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు, స్వాగత ప్రసంగం సమన్వయకర్త ఆచార్య ఆర్.లింబాద్రి చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, డా.జె.చెన్నయ్య కార్యదర్శి, తెలంగాణ సారస్వత పరిషత్తు ఎం.వి.గోనారెడ్డి ప్రముఖ విద్యావేత్త బైస దేవదాసు సంపాదకులు, ఓ దినపత్రిక డా.ఎం.మధుసూదన్ రెడ్డి ప్రముఖ విద్యావేత్త, డా.గంటా జలంధర్ రెడ్డి వ్యవస్థాపకులు, అధ్యక్షులు, తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి – డా. పోరెడ్డి రంగయ్య అధ్యక్షులు, తేజ సాహిత్య సేవా సంస్థ, సమ్మిడి ఆనంద రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్, సాగర్ సిమెంట్స్, కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement