Saturday, April 20, 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 50 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి భేటీ జరిగింది. తొలి దశలో అన్ని శాఖల్లో కలిపి 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండో దశలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు.

స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగిందన్నారు. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయని సీఎం చెప్పారు.

ఇది కూడా చదవండి: పూటకో హామీ..గంటకో అబద్ధం.. కేసీఆర్ పై బండి నిప్పులు

Advertisement

తాజా వార్తలు

Advertisement