Wednesday, April 24, 2024

కేంద్రం పైసా ఇవ్వలేదు: సీఎం కేసీఆర్

హైద‌రాబాద్‌లో వచ్చిన వ‌ర‌ద‌లతో చాలా న‌ష్టం జ‌రిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వ‌ర‌ద‌ల వ‌ల్ల వివిధ ప్రాంతాల్లో రూ. 8 వేల కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని కేంద్రానికి నివేదిక పంపామని తెలిపారు. కేంద్రం నుంచి స్పంద‌న లేదని మండిపడ్డారు. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ జ‌రిగితే కొంత డ‌బ్బు ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న ఉన్నా.. కేంద్రం దీనిపై స్పందించ‌డం లేదన్నారు. ప‌రిహారం కింద కేంద్రం పైసా కూడా ఇవ్వ‌లేదని తెలిపారు. న‌ష్టం అంచ‌నాల‌పై రెండు ర‌కాల నివేదిక‌లు పంపుతారని, తాత్కాలిక అంచనాను కేంద్రానికి పంపిస్తామన్నారు. త‌క్ష‌ణ స‌హాయం కోసం తాత్కాలిక నివేదిక పంపుతారన్న సీఎం.. హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లు వ‌స్తే ఇంత వ‌ర‌కు కేంద్ర బృందం ప‌ర్య‌టించ‌లేదు అని సీఎం పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆల్ టైమ్ హైకి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement