Sunday, March 24, 2024

ఆర్టీసీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. త‌న‌ను ఆర్టీసీ చైర్మ‌న్‌గా నియమించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గోవ‌ర్ధ‌న్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండ‌లం రావుట్ల‌లో జ‌న్మించిన గోవ‌ర్ధ‌న్‌.. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో కీల‌క నేత‌గా ఎదిగారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. స్వతంత్రంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బాజిరెడ్డి.. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేసి, 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986లో ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ సేవలు అందించారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ దేవి చేతిలో 14,043 ఓట్లు తేడాతో ఓడిపోయారు. 1999లో ఆర్మూర్ నుంచి విజయం సాధించారు. గతంలో పిఏసిఎస్ ఛైర్మన్‌గా, హౌసింగ్ బోర్డు కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.

గోవర్ధన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. 1999-2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా 2004-2009 వరకు బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్తిగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. శ్రీనివాస్ పై 26,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేకుల భూపతిరెడ్డి పై 29,855 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2015- 2018 వరకు తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై ​​హౌస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.

ఇది కూడా చదవండి: పోలీసులే నా భర్తను చంపారు: నిందితుడు రాజు భార్య సంచలన ఆరోపణ

Advertisement

తాజా వార్తలు

Advertisement