Saturday, January 22, 2022

తెలంగాణలో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదా పడింది. దళిత బంధుపై సుదీర్ఘ చర్చ అనంతరం శాసన సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అంతకుముందు..

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూసే ఆశావహులకు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.దళిత బంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కూడా కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News