Thursday, April 25, 2024

ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ 91,142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ప్రకటనపై చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. బీడు భూముల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతున్నాయిని చెప్పారు. స్వరాష్ట్రంలో నిధుల వరదపారుతుందని, ఈరోజు నియామకాల జాతర జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని చెప్పారు. అసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు,తాగు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement