Friday, January 17, 2025

NZB | కామారెడ్డి జాతీయ రహదారిపై చిరుత కలకలం..

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం చాంద్రాయణపల్లి-దగ్గి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. బలమైన యాగం కారణంగా చిరుత రోడ్డుపై కదలకుండా కూర్చుండిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు.

అయితే, కొద్దిసేపటి తర్వాత చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న‌ కామారెడ్డి రేంజ్ అధికారి రమేష్, సెక్షన్ అధికారి ముబాషీర్ అలీ, అటవీ సిబ్బంది చిరుతపులి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement