Monday, December 9, 2024

Case Filled – న‌మ్మించి మోసం చేశాడు…హీరో రాజ్ త‌రుణ్ పై ప్రియురాలు ఫిర్యాదు


11 ఏళ్లుగా రిలేష‌న్.. గుడిలో కూడా పెళ్లి
ఇప్పుడేమో హీరోయిన్ మాల్వీ ప్రేమ‌లో..
కేసు న‌మోదు చేసిన పోలీసులు

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌పై పోలీసు కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీనిపై లావణ్య నేడు మీడియాతో మాట్లాడుతూ, రాజ్‌ తరుణ్‌, తాను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని , గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను మూడు నెల‌ల క్రితం వదిలేశాడని ఆరోపించింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకుండా నా నెంబర్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టి దూరం పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనికంతటికీ మాల్వీ మల్హోత్రా కారణమని తెలిపింది. రాజ్‌ తరుణ్‌ను వదిలేయకపోతే నన్ను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారంది. అంతేకాకుండా గతంలో డ్రగ్స్‌ కేసులో ఇరికించారని, మూడు నెలలపాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది. అప్పుడు కూడా రాజ్‌ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. త‌నకు పోలీసులు న్యాయం చేయాల‌ని కోరింది.. వివాహానికి సంబంధించిన ఫోటోలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement