Sunday, December 8, 2024

TG | దాతృత్వం ఒక అదృష్టం… ఆచార్య కొలకలూరి ఇనాక్

సేవా రంగంలో స్త్రీ శక్తి తిరుగులేనిది
జస్టిస్ రజని


హైదరాబాదు, ఆంధ్రప్రభ: లయన్ ఆరిగపూడి కృష్ణకుమారి సేవలు ప్రశంసనీయమని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు.ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖకవి డా.బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్వర్గీయ కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారాల ప్రధాన సభ జరిగింది. మహిళలు త్యాగమూర్తులే కాదని కళా సాహిత్య సేవా రంగాల్లో మహిళలకు సమాన ప్రాధాన్యత కల్పించాలని జస్టిస్ టి.రజని కోరారు. లయన్ కృష్ణకుమారి, విజయ్ కుమార్ దంపతుల సేవలు గుర్తుండి పోతాయన్నారు.

ఈ కార్యక్రమంలో జస్టిస్ బి.చంద్రకుమార్, విశ్రాంత ఇన్ కం టాక్స్ ఛీప్ కమీషనర్ యం.నరసింహప్ప, రిటైర్డ్ ఐ.జి.బి.వి. రమణకుమార్, తెలుగు వన్ ఛానల్ యం.డి కంఠంనేని రవిశంకర్, ఆంధ్రప్రభ ఎడిటర్ వై.యస్.ఆర్ శర్మ, ప్రముఖ నవలాకారులు భగీరథ, కవులు డా.జెల్ది విద్యాధర్, డా.నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా డా.రామకృష్ణ కోడూరి, భగీరథ, గీతాంజలి, రామచంద్రనాయక్, వాలేటి శ్రీనివాస్, కె.అల్పనజ్యోతి, రాంబాబు, శ్రీరాం దత్తి, డా.రఘు ఆరికపూడి, జానమద్ది విజయ్ భాస్కర్ లకు లయన్ ఎ.కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరితో పాటు కళా, సాహిత్య, జర్నలిజం, సేవారంగాల వారికి, కవులకు కృష్ణకుమారి జాతీయ స్మారక పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాధాకుసుమ, పద్మశ్రీలత, శ్రీపేరిలు నిర్వహించిన కవిసమ్మేళనం అలరించించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement