Friday, May 20, 2022

న‌గ‌దు, న‌గ‌ల కోస‌మే మ‌ర్డ‌ర్‌.. జంట హ‌త్య‌ల‌ కేసులో నిందితుల అరెస్టు

హైద‌రాబాద్‌లోని సరూర్ నగర్ పరిధిలో జరిగిన తల్లి, దత్తపుత్రుడి హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, డ్రైవర్ నరసింహగౌడ్ ఈ హత్యలకు కుట్ర చేసినట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు కోసమే త‌న‌ స్నేహితులతో కలిసి
ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నరసింహ గౌడ్, అతని స్నేహితులు ఒప్పుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.
అయితే.. సాయి తేజని చంపింది మాత్రం శివ కుమార్ అని పోలీసులకు డ్రైవర్ నరసింహ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఐదుగురు నిందితులను సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల‌లో ఏ-1 నర్సింహ, ఏ-2 శివ, ఏ-3 సాయి తేజ (లేట్), ఏ-4 విక్టరీ బాబు, ఏ-5 సాయి గౌడ్, ఏ-6 ఆంజనేయులు (అంజి) ఉన్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement