Thursday, April 25, 2024

నంబర్ ప్లేట్ లేకపోతే కేసు.. పెండింగ్ చలాన్లు కట్టాల్సిందే..

నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి హెచ్చరించారు. శుక్రవారం రాత్రి సుల్తానాబాద్ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహించి ఈ నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనాల తనిఖీలు చేపట్టి పెండింగ్లో ఉన్న చలాన్ లను కట్టించారు. అనంతరం రన్ రాజా నగర్ లో కచ్చితంగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని లేకపోతే ఫాలో అవడంతో పాటు జరిమానా కట్టాల్సి వస్తుందన్నారు వాహనదారులు పెండింగ్ చలాన్ లను వెంటనే చెల్లించాలన్నారు. తనిఖీల్లో సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్, వినీత తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement