Tuesday, October 1, 2024

TG: కారు బోల్తా.. ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓఆర్ఆర్‌పై వేగంగా వెళుతున్న కారు ఉన్నట్లుండి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదానికి గురైంది. పల్టీలు కొడుతూ కింద పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్ప‌త్రికి పంపించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement