Sunday, January 23, 2022

వాగులోకి దూసుకెళ్లిన కారు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఓ కారు అదుపు తప్పి తుమ్మలవాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప  గాయాలు అయ్యాయి. ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో చిక్కకున్న ప్రయాణికులను స్థానికులు బయటికి తీశారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News